* మీ ఇంటి గదులెంత విశాలమైనవో దేవుడు అడగడు.
నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావో అడుగుతాడు!
* నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు.
నీ సంపాదనలో ఎంత నిజాయతీ ఉందో అడుగుతాడు!
* నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు.
నీ విధ్యుక్త ధర్మాన్ని నీ శక్తికొద్దీ నిర్వహిస్తున్నావా అని అడుగుతాడు!
* నీదెంత పెద్దకారో దేవుడు అడగడు.
నడిచి వెళ్లేవాళ్లను ఎందరిని నీ కారులో తమ గమ్యానికి చేర్చావని అడుగుతాడు!
* నువ్వెంత గొప్పవాడలో నివసిస్తున్నావని దేవుడు అడగడు.
నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వెలా మెలగుతున్నావని అడుగుతాడు!
* నీకెంతమంది స్నేహితులున్నారని దేవుడు అడగడు.
నువ్వెంతమందికి స్నేహితుడివని అడుగుతాడు!
* నీ ఒంటి రంగేమిటని దేవుడు అడగడు.
నీలో ఎంత సౌశీల్యత ఉందని అడుగుతాడు!
* నువ్వు ఏ ఘనమైన పిండివంటలతో భోజనం చేస్తావని దేవుడు అడగడు.
నువ్వెంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు!
* నీ అలమరలో నీకెన్ని జతల బట్టలున్నాయని దేవుడు అడగడు.
నువ్వెంతమంది నిర్భాగ్యులకు నీ బట్టలిచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు!
* నువ్వెంతమందికి న్యాయం చేశావని దేవుడు అడగడు.
ఎంతమందికి అన్యాయం కాకుండా చూశావని అడుగుతాడు!
* నువ్వెందరికి గుణాలు పంచి ఇచ్చావని దేవుడు అడగడు.
ఎందరి కష్టాల్లో పాలు పంచుకున్నావని అడుగుతాడు!
* నువ్వెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావని దేవుడు అడగడు.
చదివిన పుస్తకాల్లో నువ్వెంత సారాన్ని గ్రహించావని అడుగుతాడు!
* నువ్వెన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు.
నువ్వెంత మానవసేవ చేశావని అడుగుతాడు!
* నువ్వెలాంటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు.
ఇంకొకరికి సాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించమంటాడు!
* ముక్తిపథం చేరటానికి ఇంత ఆలస్యం చేశావేమని దేవుడు అడగడు.
నువ్వురాగానే నీ చెయ్యి పట్టుకుని స్వర్గధామం వైపు తానే తీసుకువెడతాడు.
(Enadu,15:02:2008)

Comments
Post a Comment