Skip to main content

Posts

Showing posts with the label Devotional

What GOD asks

* మీ ఇంటి గదులెంత విశాలమైనవో దేవుడు అడగడు. నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావో అడుగుతాడు! * నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు. నీ సంపాదనలో ఎంత నిజాయతీ ఉందో అడుగుతాడు! * నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు. నీ విధ్యుక్త ధర్మాన్ని నీ శక్తికొద్దీ నిర్వహిస్తున్నావా అని అడుగుతాడు! * నీదెంత పెద్దకారో దేవుడు అడగడు. నడిచి వెళ్లేవాళ్లను ఎందరిని నీ కారులో తమ గమ్యానికి చేర్చావని అడుగుతాడు! * నువ్వెంత గొప్పవాడలో నివసిస్తున్నావని దేవుడు అడగడు. నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వెలా మెలగుతున్నావని అడుగుతాడు! * నీకెంతమంది స్నేహితులున్నారని దేవుడు అడగడు. నువ్వెంతమందికి స్నేహితుడివని అడుగుతాడు! * నీ ఒంటి రంగేమిటని దేవుడు అడగడు. నీలో ఎంత సౌశీల్యత ఉందని అడుగుతాడు! * నువ్వు ఏ ఘనమైన పిండివంటలతో భోజనం చేస్తావని దేవుడు అడగడు. నువ్వెంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు! * నీ అలమరలో నీకెన్ని జతల బట్టలున్నాయని దేవుడు అడగడు. నువ్వెంతమంది నిర్భాగ్యులకు నీ బట్టలిచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు! * నువ్వెంతమందికి న్యాయం చేశావని దేవుడు అడగడు. ఎంతమందికి అన్యాయం ...

Antharyami

అది ఒక పల్లెటూరు.   దేవుడు లేడని వాదించేవాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు.   ఆ వూరికి ఏ సాధువు, సన్యాసి వచ్చినా అక్కడి నాస్తికవాదులందరూ ఒక్కటై చుట్టుముట్టి 'దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు' అని వేధించేవారు. ఒకసారి ఆ వూరికి ఒక యోగి వచ్చి అక్కడి రామాలయంలో మకాం వేశాడు. అల్లరి గుంపంతా కలిసి వెళ్లి యోగిని ముట్టడించింది. ఆ మహాత్ముడు వారడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పి 'నాయనలారా! రెండు రోజులుగా భోజనం చేయలేదు. ఏమైనా తెచ్చి ఇవ్వగలరా?' అని కోరాడు. వారిలో ఒక యువకుడు వెంటనే ఇంటికెళ్ళి ఒక గ్లాసునిండా పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. పాల గ్లాసు చేతపట్టుకొని అక్కడే పడి ఉన్న ఒక పుల్లతో పాలను కలియబెడుతూ పదేపదే పరీక్షగా ఆ పాలలోకి తొంగిచూడటం మొదలుపెట్టాడు. పాలు తాగమన్నాడు తెచ్చి ఇచ్చిన యువకుడు. 'నాయనా!   పాలలో వెన్న ఉంటుందని అంటారు. ఆ వెన్న చూద్దామని వెతుకుతున్నాను'  అని చెప్పాడు యోగి. 'భలేవాడివే. అలా వెతికితే వెన్న ఎలా కనబడుతుందనుకున్నావు? ప్రతి పాల బొట్టులోనూ వెన్న ఉంది. కానీ అది అలా కనబడదు. దాన్ని వెలికితీసే పద్ధతి వేరే ఉంది. పాలను కాచి, తోడుపెట్టి, చిలికితే తప్ప వెన్న కనబడదు'  ...