Skip to main content

Posts

Showing posts with the label Psychology

జీవన మకరందం

కొందరిని చూస్తుంటే- ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఆనందంగా కనిపిస్తారు. మరికొందరిని చూస్తే నిత్యం దుఃఖం ఓడుతూ ఉంటారు. 'నువ్వు ఆనందస్వరూపుడివి...' అంటుంది వేదాంతం. కాదు పొమ్మంటుంది- వాస్తవ జీవితం! ఈ వ్యత్యాసానికి మూలాలు కనుగొనాలని మనిషి ఎంతోకాలంగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆనందంకోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. దాని నిజస్వరూపం బోధపడక, స్వేచ్ఛగా విలాసంగా గడపడమే- ఆనందం అని మనిషి పొరపడటం మనం ఈనాడు చూస్తున్నాం. సుఖమూ, సంతోషమూ, ఆనందమూ అనేవి నిజానికి వేరువేరు. ఈ మూడూ ఒకటేనని మనిషి పొరపడుతుంటాడు. సుఖం అనేది ఇంద్రియ, లేదా శారీరక సంతృప్తిని వ్యక్తం చేసే పదం. ఎండలో తిరిగినవాడు చల్లని నీడలోకి రాగానే శరీరానికి సుఖంగా అనిపిస్తుంది. సంతోషమనేది మనసుకు కలిగేది. మంచి సమాచారం విన్నప్పుడో, ఏదైనా బాగా కలిసొచ్చినప్పుడో మనసు ఉత్తేజమవుతుంది. మనసుకు సంతోషం కలిగినప్పుడు శరీరం కూడా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటుంది. ఈ రెండింటికన్నా ఉన్నతమైనది, ఉదాత్తమైనది- ఆనందం. శారీరక మానసిక ఆధ్యాత్మిక కక్ష్యలు మూడింటికీ సంతృప్తిని కూర్చే ఒకానొక గొప్ప స్థితిపేరు ఆనందం. ఆత్మకు సంతృప్తిని కలిగించే పనులను చక్కబెట్టినవారికి- ఆనందమయ స్థితి వ...

సాధనే సాఫల్యం

చేతినిండా పని, మనసునిండా తగిన ఆలోచనలు... ఈ రెండూ మనిషి ప్రగతి రథానికి రెండు చక్రాలు. పనిలేకపోవడం వలన నిరాసక్తత ఏర్పడుతుంది. అలాంటివారిలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఆ నిర్లిప్తత వల్ల ఎన్నో అనర్థాలు. అందుకే 'పనిలేనివాడి బుర్ర దయ్యాల నిలయం' అనే నానుడి పుట్టింది. ఎల్లప్పుడూ పని చెయ్యడానికి అలవాటు పడిన శరీరం చురుకుగా ఉంటుంది. మెదడూ ఉత్సాహం పుంజుకొంటుంది. శరీరాన్ని శ్రమ పెట్టకుండా సుఖాలు కల్పిద్దామని విశ్రాంతినిచ్చామో... శరీరం, మనసు రెండూ రోగగ్రస్తం కావడం మొదలు పెడతాయి. చైతన్యపురంలో కృషీవలుడు అనే రైతు ఉండేవాడు. అతడికి ఉన్నది కొద్దిపాటి భూమి. అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలసాయం పొందుతూ ఉండేవాడు. అతడు విశ్రాంతిగా ఒక్కరోజైనా కూర్చునేవాడు కాదు. ఒకసారి అతడు పొలం దున్నుతూ ఉండగా అటు వెళుతున్న ఆ ప్రాంత జమీందారు చూశాడు. అది నడివేసవి కాలం. కృషీవలుడి గురించి, అతడి విజయాల గురించి అంతకుముందే విన్నాడతను. ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ- బండి ఆపించి దిగి అతడి దగ్గరకు వెళ్ళాడు. పరస్పర పరిచయాలు అయ్యాక 'ఇంత ఎండలో పని...

For Teenagers(English:Sean Covey)

పదహారేళ్ల వయసంటే... అయస్కాంతాల మధ్య ఇనుపరజం. చౌరస్తాలో బాటసారి. సరికొత్త అనుభవాల అన్వేషి. బోలెడన్ని ఆకర్షణలు. బోలెడన్ని భ్రమలు. బోలెడన్ని సందేహాలు. బోలెడన్ని అపోహలు. ఎలా నిలవాలి? ఎలా గెలవాలి? ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వవికాస రచయిత స్టీఫెన్‌కోవె తనయుడు సీన్‌కోవె తన కౌమార అనుభవాల్ని రంగరించి రాసిన సప్తసోపానాల వికాస సూత్రాలివి... ఓ శిల్పి తదేకదీక్షతో రాతిని రమణీయమైన శిల్పంగా తీర్చిదిద్దుతున్నాడు... అదే ప్రపంచమైనట్టు, అదే జీవిత లక్ష్యమన్నట్టు. సరిగ్గా అలాంటి శిల్పమే ఓ మూలనపడుంది. అటుగా వెళ్తున్న యాత్రికుడు దాన్ని చూశాడు. అద్భుతంగా ఉంది. జీవకళ ఉట్టిపడుతోంది. అంత గొప్ప శిల్పం ఉండగా, మరొకటి చెక్కాల్సిన పనేముంది? లేదంటే, రెండూ అవసరమై ఉండాలి. శిల్పి సేదదీరుతున్న సమయంలో, యాత్రికుడు మాటలు కలిపాడు. సందేహం వెలిబుచ్చాడు. శిల్పి ఓ నవ్వు నవ్వి, ఇలా చెప్పాడు... 'వెుదటి శిల్పం పూర్తికావస్తున్న సమయంలో ఒక పొరపాటు జరిగింది. అందుకే దాన్ని పక్కనపెట్టి, మరొకటి చెక్కుతున్నాను'. 'ఎంత జాగ్రత్తగా గమనించినా, ఒక్కటంటే ఒక్క లోపం కూడా కనబడటంలేదే'... మరోసారి శిల్పాన్ని తదేకంగా చూస్తూ చెప్పాడు యాత్ర...