అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ మెలగెడు జనులెల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అధికుడైన రా జొకల్పుని జేపట్ట వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము: ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దూఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూంటారు. అత్యంత ప్రేమానురాగాల్లొ ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది *********************************************** నిండునదులు పారు నిలచిగంభీరమై వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడురీతి నధిక...
Don't worry about things that are beyond your control.




Comments
Post a Comment