Skip to main content

Vivekananda

''జీవితంలో అందమైన మలుపు ఇది. బతుకును పూలతేరుగా పేర్చుకున్నా ముళ్లబాటగా మలుచుకున్నా పునాది పడేది ఇక్కడే. బడి గడపలు దాటి కాలేజీ గేటులోకి అడుగిడే మధుర క్షణాల నుంచి సమాజంలో ఓ వ్యక్తిగా మనకంటూ గుర్తింపును సాధించే వరకూ ఎన్నో మలుపులు... మరెన్నో మార్పులు. నా ఆశలన్నీ యువతరం పైనే. వారే ఆశయ సాధకులు'' అనే స్వామి వివేకానంద మాటలు యువతకు ఎప్పటికీ ఆచరణీయాలే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉండాలనే ఆయన యువత కోసం ఎన్నో 'ఆయుధాలు... నైపుణ్యాలు' సూచించారు. వాటిల్లో కొన్ని మీకోసం.

 1అందరూ నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఒకటుంది. ఎవరినీ నిందించకండి. ఎవరి పైనా నెపం వేయకండి. దేనికైనా మీరే కారకులని గుర్తించండి. అదే నిజం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

2 ఇది గ్రహించండి. అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళే ఆపదలో పడతారు. గౌరవాన్ని కోల్పోతామని భయపడేవాళ్ళే అవమానానికి గురవుతారు. నష్టాలకు బెదిరిపోయే వాళ్ళే అన్నీ కోల్పోతారు.

3 మనని అజ్ఞానులుగా మార్చేది ఎవరు? మనమే. మన చేతులతో మనమే కళ్ళు మూసేసుకుని అంతా చీకటిగా ఉందని ఏడుస్తున్నాం.

4ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే జీవితం చేసుకోండి. దాని గురించే ఆలోచించండి. కలలు కనండి. దానిపైనే బతకండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి భాగమూ ఆ లక్ష్యంతో నిండిపోనివ్వండి. అదే విజయానికి దారి.

5 ప్రేమ... డబ్బు జ్ఞానం.. చదువు... దేనికోసమైనా సరే అదే లక్ష్యంగా తపన పడేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుం పట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

6ఆత్మవిశ్వాసం లేకపోవడం క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తులు జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మ విశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకంలేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

7 అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం... ఇవే మనకు కావాలి. వీటితోనే మనం ఏదైనా సాధించగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

8 ఎవరికో బానిసలా కాకుండా యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అదే నిన్ను యజమానిని చేస్తుంది.

9 మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ, ఇనుప కండరాలూ కావాలి. మేథస్సుకు చదువులా... శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంట పూజ చేసేకన్నా ఫుట్‌బాల్‌ ఆడటం మంచిది. బలమే జీవితం. బలహీనతే మరణం.

10 వెళ్లండి ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యథను తుడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణంకూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం... కలహం కాదు.కోరుకోవాల్సింది సృజన... విధ్వంసం కాదు. కావాల్సింది శాంతి, సమన్వయం. సంఘర్షణ కాదు.
(Eenadu, 12:01:2008)

Comments

Popular posts from this blog

Tips for employees(In telugu)

(From Eenadu Sunday special  17/07/11)

10,000hours

గొప్పవారు కావాలని కలలు కనేది ఎందరో... అది నేరవేరేది కొందరికే ఎందుకు?   ఆ రహస్యాన్ని ఛేదించారు జర్మన్‌ పరిశోధకులు.  ఏదో ఒక రంగంలో గొప్ప అవ్వాలని ప్రతి మదిలో రగులుతుంటుంది. అసలు లోపం మాత్రం కష్టపడడంలోనే. ఎంచుకున్న రంగంలో దాదాపు 10,000 గంటలు కృషిచేస్తే అనుకున్న లక్ష్యం సాధించగలం. పరిశోధకుల పరిశీలన ప్రకారం 10,000 గంటలు శ్రమిస్తే విజయం ఎలాంటి వారినైనా వరించి తీరుతుంది. తెలివితేటలు, అదృష్టం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవైనా సాధన మాత్రమే తెలివిని, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందని ఈ పరిశోధనల సారాంశం.  దీన్ని రుజువు చేయడానికి పరిశోధకులు బెర్లిన్‌ సంగీత అకాడమీని తమ కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ రోజూ ఎంతో మంది వయొలిన్‌ నేర్చుకుంటుంటారు. అయితే ఐదేళ్ల చిన్నారుల రోజువారీ సాధనను నమోదు చేసేవారు. మొదట్లో రెండు నుంచి మూడు గంటలు... వయసు పెరుగుతున్న కొద్దీ సాధన పెరిగింది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి అత్యుత్తమ స్థాయి విద్యార్థుల సాధన 10,000 గంటలకు చేరింది. కొందరు 8,000 గంటల సాధనతో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా పరిశీలించి మెదడు తనకు కావాల్సిన విషయాలను నేర్చుకోడానికి,...

Try these

WORK as if you have no need of the money. LOVE as if nobody ever made you suffer. DANCE as if nobody is watching you. SING as if nobody is hearing you. LIVE as if the paradise were on this Earth.