అదిఏమిటో ... కాలేజీలో ఎంతోమంది గాయ్స్ అండ్ గాళ్స్ ఉన్నా అందులో కొంతమందేసెంటరాఫ్ ఎట్రాక్షన్. చదువు చెప్పే టీచర్లనుంచి తోటి స్టూడెంట్స్ దాకా అందరికీవాళ్లంటేనే వల్లమాలినఅభిమానం. అలాంటిఅమ్మాయిలనుఆకట్టుకోవాలని అబ్బాయిలు, ఆ తరహా అబ్బాయిలను అట్రాక్ట్ చేయాలని అమ్మాయిలు ట్రై చేయడం కామనే. వీళ్లను చూసి'వాళ్లలో ఉన్నదేంటి? నాలోలేనిదేంటి?' అని లోలోన కుళ్లుకునే స్టూడెంట్సూ లేకపోలేదు. ఒక్కముక్కలో చేపపాలంటీ వాళ్లకున్నవినాయకత్వ లక్షణాలు! వారిలా మీరూ లీడర్ అయిపోవాలంటే సింపుల్గాకింది ఐదు సూత్రాలు పాటిస్తే సరి.
1. భయాన్ని భయపెట్టండి:
'ఏం మాట్లాడితే ఏం కొంపలంటుకుంటాయో? ఏం తప్పు జరుగుతుందో' చాలామందిలో ఉండే అనవసర భయాలివి. నిజానికి ఈ ప్రపంచంలో తప్పులు చేయనివారెవరూ ఉండరు. అయితే మీరు చేస్తుంది తప్పా ఒప్పా అని తెలుసుకోవాలంటే ముందు విషయం బయటకి రావాలి కదా. తప్పైనా ఒప్పైనానలుగురిలో నిర్భయంగా మాట్లాడండి.
2. నచ్చిన సబ్జెక్టులో మెరవండి:
అందరూ అన్ని విషయాల్లో నిపుణులు కాకపోయినా ఒక్కో విషయంలోనైనా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. ఉదాహరణకు కొందరికి మ్యాథ్స్‌ను రఫ్ఫాడిస్తే ఇంకొందరు ఫిజిక్స్‌ని పిండి చేసేస్తారు. అలా నచ్చిన సబ్జెక్టులో నెంబర్వన్గా నిలిస్తేగుర్తింపొచ్చి మీ ఒళ్లో వాలదూ?
3. సంకోచం వదలండి:
టీచర్లుంది చదువు చెప్పడానికి. మీలో తప్పొప్పులు ఎంచుతూ కూర్చోడానికి కాదు. సంకోచాలు వీడి అర్ధంకాని విషయాలు అడగండి. మొహమాట పడితే మొదటికే మోసం. 'వెన్ ఇన్ డౌట్ కట్ ఇట్ ఔట్'.
4. బాధ్యతగా మెలగండి:
నాయకుడికుండాల్సిన ముఖ్య లక్షణం బాధ్యతలు స్వీకరించడం. రిస్క్జోలికెళ్లనంటే రేస్లో వెనకబడిపోతారు.కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా బాధ్యతలు తీసుకొండి. ఎవరికే ఇబ్బందొచ్చినా ముందుండి అండగానిలవండి.
5. వందశాతం మనసు:
దాహం వేసినపుడే బావి తవ్వుతానంటే కుదరదు. ఆటలో గెలవాలన్నా, పరీక్షల్లో మెరవాలన్నా ప్రణాళిక ప్రకారం వెళ్లాలి. అన్యమనస్కంగా చేస్తే అర ఫలితాలే వస్తాయి. మనసుపెట్టి చేయండి ఆల్‌రౌండర్‌గా నిలవండి.
(ఈనాడు, ఈతరం, ౧౩:౦౩:౨౦౧౦)

Comments
Post a Comment